kcr: సెప్టెంబరు 2న తెలంగాణ కేబినెట్ మీటింగ్?

  • బహిరంగ సభకు రెండు గంటలు ముందు సమావేశం
  • ప్రగతిభవన్ లో ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 
  • హెలికాఫ్టర్ ద్వారా బహిరంగసభకు సీఎం, మంత్రులు

సెప్టెంబర్ 2న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజు జరగనున్న ప్రగతి నివేదన సభకు రెండు గంటలు ముందుగా ఈ సమావేశాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రగతిభవన్ లో ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమావేశం జరగనుంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోనుంది.

కాగా, ఈ భేటీ అనంతరం కొంగరకలాన్ లో జరగనున్న ప్రగతి నివేదన సభకు కేసీఆర్, మంత్రులు వెళ్లనున్నారు. అయితే, అప్పటికే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ఉంటాయి. రోడ్డు మార్గంలో వారు సభా స్థలిని చేరుకోవడం కష్టం కనుక, బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో అక్కడికి వెళతారని పార్టీ వర్గాల సమాచారం.

kcr
september 2
cabinet meeting
  • Loading...

More Telugu News