kumaraswamy: కుమారస్వామి పెళ్లి సంబంధం కోసం రాలేదు: ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు

  • కుమారస్వామి మా ఫ్యామిలీ ఫ్రెండ్
  • అందుకే ఆయనను భోజనానికి పిలిచాం
  • పెళ్లి చూపులుపై క్లారిటీ ఇచ్చిన కోటేశ్వరరావు

తన కుమారుడికి ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు కుమార్తెతో పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వచ్చారనే వార్త ఉదయం నుంచి ప్రచారమవుతోంది. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత కుమారస్వామి దంపతులు కోటేశ్వరరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, పెళ్లి సంబంధం కోసం కుమరస్వామి రాలేదని చెప్పారు. ఆయన తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అందుకే విజయవాడకు వచ్చిన ఆయనను భోజనానికి పిలిచామని తెలిపారు. 

kumaraswamy
son
vijayawada
profit shoe company
koteswara rao
  • Loading...

More Telugu News