kumaraswamy: కర్ణాటక సీఎం కుమారుడుకి, ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కుమార్తెకు పెళ్లిచూపులు!

  • బొడేపూడి శివ కోటేశ్వరరావు కుమార్తెతో నిఖిల్ పెళ్లిచూపులు
  • అమ్మాయిని చూసేందుకు వచ్చిన కుమారస్వామి
  • వెంట ఉన్న లగడపాటి రాజగోపాల్

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు తమ కుమారుడు నిఖిల్ పెళ్లి చూపుల కోసం విజయవాడకు వచ్చారు. పెళ్లి చూపుల కోసం నగరంలో ఉన్న ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బొడేపూడి శివ కోటేశ్వరరావు నివాసానికి చేరుకున్నారు. కోటేశ్వరరావు కుమార్తెకు నిఖిల్ తో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమ్మాయిని చూడటానికి కుమారస్వామి దంపతులు వచ్చారు. ఈ సందర్భంగా వీరి వెంట మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ఉన్నారు. అంతకు ముందు వీరు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

kumaraswamy
son
profit shoe company
daughter
bodepudi siva koteswara rao
  • Loading...

More Telugu News