hari krishna: హరికృష్ణ పాడెను మోసిన చంద్రబాబు, జస్టిస్ చలమేశ్వర్.. ప్రారంభమైన అంతిమయాత్ర!
- ప్రారంభమైన హరికృష్ణ అంతిమయాత్ర
- పాడెను కుడి భుజంపై మోసిన చంద్రబాబు
- ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానానికి పార్థివదేహం
దివంగత హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన అంతిమయాత్ర మొదలైంది. కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు పాడె ముందు నడుస్తుండగా... ముఖ్యమంత్రి చంద్రబాబు పాడెను తన కుడి భుజంపై మోశారు. మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కూడా పాడెను మోశారు. అనంతరం భౌతికకాయాన్ని అంతిమయాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలోకి చేర్చారు. తన నివాసం నుంచి మహాప్రస్థానానికి హరి అంతిమయాత్ర మొదలైంది.