Nimmakuru: రెండు నెలలకోసారి గరికపర్రు వచ్చి, నాలుగు రోజులు గడిపే హరికృష్ణ!

  • నిమ్మకూరుతో పాటు గరికపర్రులోనూ విషాదం
  • తోడల్లుడు హనుమంతరావు ఇంటికి వచ్చే హరికృష్ణ
  • అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న గరికపర్రు వాసులు

నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో కృష్ణా జిల్లాలోని నిమ్మకూరుతో పాటు తోట్లవల్లూరు మండలం గరికపర్రులోనూ విషాదం అలముకుంది. గరికపర్రుతో ఆయనకున్న అనుబంధం అటువంటిది. ఇక్కడికి హరికృష్ణ ప్రతి రెండు నెలలకూ ఓమారు వచ్చి, మూడు, నాలుగు రోజులు ఉండి వెళ్లేవారు. హరికృష్ణ భార్య లక్ష్మికి చెల్లెలైన సీతాదేవి, ఆమె భర్త, హరికృష్ణ తోడల్లుడు సూరపనేని హనుమంతరావులు ఇక్కడ నివాసం ఉండటమే ఇందుకు కారణం.

హరికృష్ణకు, హనుమంతరావుకు మంచి అనుబంధం ఉండేది. పైగా, పక్కనే ఉన్న పెనమకూరులో ఉన్న వీరపనేని శివరామకృష్ణ ప్రసాద్, హరికృష్ణకున్న ప్రధాన అనుచరుల్లో ఒకరు. హరికృష్ణ వచ్చిన ప్రతిసారీ ఆయన్ను కలిసేందుకు శివరామకృష్ణ వచ్చేవారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు గరికపర్రు వాసులు.

Nimmakuru
Garikaparru
Harikrishna
Road Accident
  • Loading...

More Telugu News