maoist: పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు.. పక్కా స్కెచ్ తో హతమార్చిన మావోలు!

  • ఛత్తీస్ గఢ్ దంతేవాడలో ఘటన
  • పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు
  • మాటేసి హతమార్చిన సహచర మావోలు

ఛత్తీస్ గఢ్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కొద్ది రోజుల క్రితం పోలీసులకు లొంగిపోయిన ఓ మావోయిస్టు స్వగ్రామానికి వెళ్లగా మాటువేసిన మావోలు అతనిని అపహరించి దారుణంగా తుపాకీతో కాల్చిచంపారు.

ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడ జిల్లా చోళనార్ గ్రామానికి చెందిన పోడియా వడ్డే అనే మావోయిస్టు ఇటీవల పోలీసులకు లొంగిపోయాడు. ఇతను గత పాతికేళ్లుగా మావోయిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు, సాయుధ బలగాలు లక్ష్యంగా పోడియా చాలా దాడులు చేశాడు.

కాగా లొంగిపోయిన పోడియాను బయటకు వెళ్లవద్దనీ, గ్రామాలకు అస్సలు పోవద్దని పోలీస్ అధికారులు హెచ్చరించారు. కానీ అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన పోడియా బుధవారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లాడు. అప్పటికే పోడియా కోసం మాటువేసిన మావోయిస్టులు అతడిని ఎత్తుకెళ్లి అత్యంత కిరాతకంగా హత్యచేశారు.

maoist
chattisgargh
killed
surrender
  • Loading...

More Telugu News