Rahil: 'నా కొడుకు అల్లరోడే' అంటూ వీడియో పోస్టు చేసిన జెనీలియా... చూడండి!

  • రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్న జెనీలియా
  • ప్రస్తుతం రెండేళ్ల వయసులో రాహిల్
  • 'బచ్చా ఫిట్‌ తో దేశ్ ఫిట్' అంటూ సవాల్!

"వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ..." అంటూ సందడి చేస్తూ, తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన జెనీలియా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుని, బిడ్డ రాహిల్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండేళ్ల వయసులో ఉన్న రాహిల్, అల్లరి చేయడంలో తల్లికి ఏ మాత్రం తీసిపోడట. ఇప్పుడే ఈ బుడతడు రాక్ క్లైంబింగ్ వంటి సాహసాలు చేసేస్తున్నాడు.

"రాహిల్ తన తండ్రి చేసిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ ను స్వీకరించాడు. ఇప్పుడు వాడు చిన్నారులందరికీ 'బచ్చా ఫిట్‌ తో దేశ్ ఫిట్' అనే ఛాలెంజ్ చేస్తున్నాడు" అంటూ ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి.

Rahil
Ritesh Deshmukh
Janelia
  • Error fetching data: Network response was not ok

More Telugu News