Chennai: చెప్పులలో బంగారం... అడ్డంగా బుక్కయిన వైనం!

  • చెన్నై మీనంబాక్కం ఎయిర్ పోర్టులో ఘటన
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • లోదుస్తుల్లో అబుదాబీ కరెన్సీని తెచ్చిన వ్యక్తి అదుపులో

తన పాదరక్షల్లో బంగారాన్ని దాచి తీసుకు వచ్చిన ఓ వ్యక్తిని చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అస్మద్ ఖాన్ (34) అనే వ్యక్తి, తన చెప్పుల అడుగు భాగంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక అరలో బంగారాన్ని దాచి తీసుకు వచ్చాడు. తనిఖీల్లో భాగంగా అనుమానం వచ్చిన అధికారులు, అతని గుట్టును రట్టు చేశారు.

అలాగే కేరళకు చెందిన ప్రకాశ్ అనే మరో వ్యక్తి, తన సూట్ కేసులో బంగారాన్ని దాచి, దర్జాగా ఎయిర్ పోర్టులో దిగగా, అతన్నీ పట్టుకున్నారు. వీరిద్దరి నుంచీ స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.33 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇదే సమయంలో చెన్నై వాసి మహ్మద్ అసిఫ్, అనుమతులు లేకుండా రూ. 5 లక్షల విలువైన అబుదాబీ కరెన్సీని తన లోదుస్తుల్లో దాచి తెచ్చి, సింగపూర్ వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా, అతన్నీ అరెస్ట్ చేశారు.

Chennai
Meenambakkam
Gold
Airport
Customs
Police
Arrest
  • Loading...

More Telugu News