Uttarakhand: ప్రాణం మీదకు తెచ్చిన సరదా.. తృటిలో తప్పించుకున్న యువకుడు!

  • ఉత్తరాఖండ్ లోని రామ్ నగర్ లో ఘటన
  • వాగుకు అడ్డంగా బైక్ నడిపిన యువకుడు
  • కొద్దిదూరం కొట్టుకుపోయిన వైనం

బైక్ లతో సాహసాలు చేయడం చాలామంది యువకులకు సరదా. కానీ కొన్నిసార్లు ఆ సరదా హద్దు దాటితే ప్రాణాలకే ముప్పు వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. ఉద్ధృతంగా పారుతున్న నదిని దాటేందుకు యత్నించిన ఓ యువకుడు అదుపు తప్పడంతో కొంతదూరం ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు, స్నేహితులు అతడిని జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ నగర్ లో ఓ యువకుడు కొందరు స్నేహితులతో కలసి బైక్ తో వాగును దాటేందుకు యత్నించాడు. దీంతో అతని స్నేహితులు విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. బైక్ పై సదరు యువకుడు నీటిలోకి కొద్దిదూరం వెళ్లగానే ప్రవాహం కారణంగా పక్కకు పడిపోయి కొంతదూరం కొట్టుకుపోయాడు. చివరికి స్నేహితులు, స్థానికులు కొందరు యువకుడిని ఒడ్డుకు తీసుకొచ్చారు.


Uttarakhand
floods
rain
youth
biker
stunt
  • Error fetching data: Network response was not ok

More Telugu News