NandamuriHarikrishna: హరికృష్ణ మృతిపై కేవీపీ తీవ్ర దిగ్భ్రాంతి!

  • హరికృష్ణ కుటుంబసభ్యులకు తీవ్ర సంతాపం
  • తామిద్దరం ఒకేసారి రాజ్యసభకు ఎన్నికయ్యామని గుర్తు చేసుకున్న కేవీపీ
  • సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవిని సైతం తృణప్రాయంగా భావించిన వ్యక్తి హరికృష్ణ

టీడీపీ సీనియర్‌ నాయకుడు, సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2008లో హరికృష్ణ, తాను ఒకేసారి రాజ్యసభకు ఎన్నికయ్యామని, సమైక్యాంధ్ర కోసం సభలో తామిద్దరం కలిసి రాజీ లేకుండా పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా కేవీపీ గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం ఎంపీ పదవిని సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేశారని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు.

NandamuriHarikrishna
kvp
Telugudesam
Andhra Pradesh
Hyderabad
Hyderabad District
Telangana
  • Loading...

More Telugu News