paruchuri gopalakrishna: అప్పుడు మాత్రం రోజాపై కోప్పడ్డాను: పరుచూరి గోపాలకృష్ణ

  • సంభవం ' సినిమా షూటింగులో గాయపడింది
  • ఆ సమయంలోనే బాగా బరువు పెరిగింది 
  • 10 యేళ్లలో 100 సినిమాలకి పైగా చేసింది

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, రోజా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. 'సంభవం' సినిమా చేసేటప్పుడు కాలు విరగ్గొట్టుకుంది. అప్పుడు మాత్రం నేను కేకలేశాను. నువ్వు మరో శ్రీదేవిలా హిందీలోనూ దూసుకుపోతావని నేననుకుంటే ఎందుకమ్మా ఇలా చేశావని కోప్పడ్డాను. 'కర్తవ్యం' సినిమాలో విజయశాంతి తరహా పాత్రలో కనిపించాలని అనుకుంది. అందుకోసం అలాంటి సినిమాను ఒప్పుకుని ఫైటింగులో గాయపడింది.

అప్పుడు ఇంటిపట్టునే వుండవలసి రావడంతో బరువు పెరిగింది. ఆ తరువాత ఆమె మళ్లీ పుంజుకోవడానికి కొంత సమయం పట్టింది. అప్పుడు గనుక ఆమె గాయపడి ఉండకపోతే రెండు వందలో .. మూడు వందలో సినిమాలు చేసి ఉండేదేమో. ఏదేమైనా భారతీయ సినిమా రంగంలో కేవలం 10 సంవత్సరాల కాలంలో 100 సినిమాలను పూర్తిచేసిన తొలి హీరోయిన్ రోజా అని నేను నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చారు.  

paruchuri gopalakrishna
roja
  • Loading...

More Telugu News