Pawan Kalyan: హెలికాప్టర్ ఎక్కేందుకు పరుగులు పెట్టిన పవన్ కల్యాణ్.. వీడియో చూడండి!

  • జనసేన కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్
  • 2019లో విజయమే లక్ష్యంగా అడుగులు
  • రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జనసేనాని

జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్... క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. 2014లో ఆయన జనసేనను స్థాపించారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికిన ఆయన... ఇప్పుడు ఆ పార్టీతో పాటు, వైసీపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. '

పోరాట యాత్ర' ద్వారా ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. జనసైనికులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హెలికాప్టర్ ఎక్కేందుకు ఆయన పరుగులు పెడుతున్నట్టుగా వీడియోలో ఉంది. అయితే, ఇది ఏ సందర్భంలో జరిగిందో తెలియరాలేదు.

  • Loading...

More Telugu News