Emma Thompson: మెట్రో రైలులో నా కుమార్తెను లైంగికంగా వేధించారు.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్మా థాంప్సన్

  • గతేడాది లండన్ మెట్రోలో ఘటన
  • బీబీసీ రేడియోతో మాట్లాడుతూ వెల్లడించిన ఎమ్మా
  • ఘటనతో షాక్‌కు గురయ్యానన్న సీనియర్ నటి

లండన్ మెట్రో రైలులో తన కుమార్తెను లైంగికంగా వేధించారని ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ నటి ఎమ్మా థాంప్సన్ (59) వెల్లడించింది. బీబీసీ రేడియో 4ఎస్‌లో ‘విమెన్స్ అవర్‌’ కార్యక్రమంలో ఎమ్మా మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. గతేడాది  మెట్రో రైలులో ఈ ఘటన జరిగిందని, తన కుమార్తె గౌగా వైజ్ లైంగిక వేధింపులకు గురైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. సిగ్గుతో తలదించుకునే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వివరించింది.

 ప్రస్తుతం గౌగా వయసు 18 ఏళ్లని, మెట్రో రైలులో తనకు ఎదురైన అనుభవాన్ని బయటకు చెప్పేందుకు అప్పట్లో భయపడిందని వివరించింది. ఈ ఘటనతో తాము షాక్‌కు గురైనట్టు ఎమ్మా పేర్కొంది. ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

Emma Thompson
daughter
sexually harassed
London
  • Loading...

More Telugu News