Pilli Padma: ఇంత దారుణానికి కారణం బ్యూటీషియన్ పద్మే!: తెరపైకి వచ్చిన నూతన్ భార్య

  • కొత్త మలుపులు తిరుగుతున్న పద్మ కేసు
  • తన భర్తను పద్మ వలలో వేసుకుందని నూతన్ భార్య ఆరోపణ
  • నిత్యమూ వేధించేదంటున్న సునీత

కృష్ణా జిల్లాలో బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ ఆత్మహత్య తరువాత, ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతోంది. అసలు నిందితులు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండగా, తెరపైకి నూతన్ కుమార్ భార్య సునీత వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. తన కుటుంబం ఛిన్నాభిన్నం కావడానికి పద్మే కారణమని ఆరోపించింది.

2012లో తన వివాహం తరువాత, నూతన్ ఓ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తుండగా, అక్కడ పరిచయమైన పద్మ తన భర్తను వలలో వేసుకుందని సునీత ఆరోపించింది. ఆమెను కలవడం నూతన్ కు ఇష్టముండేది కాదని, అయినా నిత్యమూ వేధిస్తూ, తనతో విడాకులు తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండేదని చెప్పింది. ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడటానికి ఆమె చేసిన తప్పులే కారణమని చెప్పింది.

Pilli Padma
Nutan
Sucide
Sunita
  • Loading...

More Telugu News