Telangana: 6వ తేదీన రద్దుకానున్న తెలంగాణ అసెంబ్లీ?

  • ప్రగతి నివేదన సభ తరువాత అసెంబ్లీ సమావేశాలు
  • రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
  • డిసెంబర్ 8లోగా ఎన్నికలు కోరుకుంటున్న సర్కారు!

వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ శివార్లలోని కొంగర కలాన్ లో ప్రగతి నివేదన సభ జరిగిన తరువాత, నాలుగు రోజుల వ్యవధిలోనే అంటే, 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతకు ఒక్క రోజు ముందు అసెంబ్లీ సమావేశమవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ కాలపరిమితికి కనీసం ఆరు నెలల ముందు రద్దు చేస్తే, ముందస్తు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ 2014 జూన్ 8న కొలువుదీరింది కాబట్టి, ఆ తేదీకి ఆరు నెలల ముందు అంటే, డిసెంబర్ 8లోగా అసెంబ్లీని రద్దు చేస్తే, ఆరు నెలల సమయం ఉంటుంది. కానీ, ఈసీకి ఆ సమయం చాలదు. దీంతో డిసెంబర్ 8కి కనీసం రెండు నెలల ముందే సభను రద్దు చేస్తే, ముందస్తు నిర్వహించేందుకు ఈసీకి సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న తెలంగాణ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది.

Telangana
Assembly
Kongarakalan
Desolve
  • Loading...

More Telugu News