vh: 'ప్రగతి నివేదన సభ'కు అంతమందొస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా: వీహెచ్ సవాల్
- కేటీఆర్ ను సీఎం చేసేందుకే ‘ముందస్తు’
- ‘ముందస్తు’కు వెళ్లిన వాళ్లెవరూ గెలవలేదు
- తెలంగాణ’లో ‘కాంగ్రెస్’ గెలుపు ఖాయం
వచ్చే నెల 2న జరగనున్న ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది వస్తారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీ-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగా ఈ సభకు అంతమంది వస్తే కనుక, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.
ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ, కేటీఆర్ ను సీఎం చేయడానికే ‘ముందస్తు’ అంటున్నారని, అయినా, ‘ముందస్తు’కు వెళ్లిన వాళ్లెవరూ గెలవలేదని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.