karunanidhi: డీఎంకే-కాంగ్రెస్ ల మధ్య పెరుగుతున్న దూరం?

  • 30వ తేదీన చెన్నైలో కరుణానిధి సంస్మరణ సభ
  • అమిత్ షాకు ఆహ్వానం పంపిన డీఎంకే
  • కార్యక్రమానికి హాజరు కాలేని రాహుల్ గాంధీ

మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య దూరం పెరుగుతున్నట్టే అనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 30న చెన్నైలో తలపెట్టిన దివంగత కరుణానిధి సంస్మరణ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆహ్వానించడం కాంగ్రెస్ కు మింగుడుపడటం లేదు. సంస్మరణ సభకు జాతీయ నేతలందరినీ డీఎంకే ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి అమిత్ షా తప్పకుండా హాజరవుతారని బీజేపీ కూడా స్పష్టం చేసింది.

ఇదే సమయంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవడం అనుమానంగానే ఉంది. రాహుల్ విదేశీ పర్యటనలో ఉండటంతో... గులాం నబీ అజాద్ కార్యక్రమానికి హాజరవుతారని ఏఐసీసీ కార్యాలయం తెలిపింది.

సంస్మరణ సభకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, నితీష్ కుమార్, మమతాబెనర్జీ, కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరుకానున్నారని డీఎంకే తెలిపింది. మరోవైపు, ఈ సభలో అమిత్ షా ఏం మాట్లాడతారనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News