nagashaurya: మంచి రేటుకు 'నర్తనశాల' శాటిలైట్ హక్కులు

  • నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
  • కథానాయికలుగా కాశ్మీర .. యామిని 
  • ఈ నెల 30వ తేదీన భారీ విడుదల    

నాగశౌర్య కథానాయకుడిగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో 'నర్తనశాల' సినిమా రూపొందింది. కాశ్మీర .. యామిని కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఇంతకుముందు నాగశౌర్య చేసిన 'ఛలో' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ఈ సినిమాపై అంచనాలు బాగా వున్నాయి.

ఈ కారణంగానే ఈ సినిమా శాటిలైట్ హక్కులు .. డిజిటల్ హక్కులు మంచి రేటుకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. గతంలో 'ఛలో' శాటిలైట్ .. డిజిటల్ హక్కులను ఒకరికే ఇవ్వడం వలన రెండున్నర కోట్ల వరకూ వచ్చాయి. ఇప్పుడు 'నర్తనశాల' శాటిలైట్ హక్కులను మాటీవీ వారికీ, డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చారు. అందువలన మొత్తం మూడున్నర కోట్లు వచ్చినట్టుగా సమాచారం. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.    

nagashaurya
kashmira
yamini
  • Loading...

More Telugu News