poorna: పెళ్లి కోసం చాలా షరతులు పెడుతున్నారు!: హీరోయిన్ పూర్ణ

  • పెద్ద హీరోలతో చేయకపోవడంతో మలయాళంలో పేరు రాలేదు
  • అక్కడ డ్యాన్స్ అవకాశం ఉన్న పాత్రలే వస్తున్నాయి
  • ఇంట్లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు

సంప్రదాయ వస్త్రధారణతో, మంచి కథ ఉన్న చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులకు చేరువైంది పూర్ణ. మలయాళీ అయినా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంది. నటనకు మంచి అవకాశం ఉన్న చిత్రాలను మాత్రమే చేస్తున్న పూర్ణ... ప్రస్తుతం తమిళంలో ఒకటి, మలయాళంలో మూడు సినిమాలను చేస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, తనకు మలయాళం చిత్రాల కంటే తమిళంలోనే ఎక్కువ పేరు వచ్చిందని... దీనికి కారణం మలయాళంలో పెద్ద హీరోలతో చేయకపోవడమేనని చెప్పింది. తాను డ్యాన్స్ కళాకారిణిని కావడంతో... తనకు అక్కడ డ్యాన్స్ అవకాశాలు ఉన్న పాత్రలే వస్తున్నాయని తెలిపింది.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్న తనకు తరచుగా ఎదురవుతోందని... తాను ముస్లిం అని, తనకు పెళ్లి చేయాలని ఇంట్లో కూడా అనుకుంటున్నారని పూర్ణ తెలిపింది. అయితే పెళ్లి కోసం వస్తున్నవారు చాలా షరతులు పెడుతున్నారని... ముఖ్యంగా సినిమాలను వదిలేయాలనే కండిషన్ పెడుతున్నారని చెప్పింది. పెళ్లి కోసం తనను తాను మార్చుకోలేనని స్పష్టం చేసింది. 

poorna
tollywood
kollywood
marriage
  • Loading...

More Telugu News