santhosh sobhan: అల్లు అరవింద్ చేతికి 'పేపర్ బాయ్'!

  • దర్శకుడిగా సంపత్ నందికి మంచి పేరు 
  • నిర్మాతగా రెండవ సినిమా 
  • ఈ నెల 31న 'పేపర్ బాయ్' రిలీజ్

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులలో 'సంపత్ నంది' ఒకరు. అందుకు నిదర్శనంగా 'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' సినిమాలు కనిపిస్తాయి. ఇక నిర్మాతగాను గతంలో 'గాలిపటం' సినిమా చేసిన సంపత్ నంది, తాజాగా 'పేపర్ బాయ్' సినిమాను నిర్మించాడు. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ .. రియా సుమన్ జంటగా నటించారు.

ఒక పేపర్ బాయ్ కి శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఈ సినిమాలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉందట .. ఆ ట్విస్ట్ నచ్చడం వల్లనే దీనిని విడుదల చేయడానికి అల్లు అరవింద్ ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. 'రచ్చ' సినిమా నుంచి అల్లు అరవింద్ తో సంపత్ నందికి మంచి సాన్నిహిత్యం వుంది. ఆ కారణంగానే సంపత్ నంది ఆయనని కలవడం .. కంటెంట్ లో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాను పంపిణీ చేయడానికి అల్లు అరవింద్ ముందుకు వచ్చారట. ఈ నెల 31వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది.  

santhosh sobhan
riya suman
  • Loading...

More Telugu News