renuka chowdary: ఫైర్ బ్రాండ్ అనేది మీరు పెట్టిన పేరే: రేణుకా చౌదరి

  • నేను ఫైర్ బ్రాండ్ కాదు
  • ఎంతో అన్యోన్యంగా, వినయంగా, విధేయతతో ఉంటా
  • కాంగ్రెస్ లో వర్గాలకు తావు లేదు

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అంటేనే ఫైర్ బ్రాండ్. ఏ విషయమైనా సరే, ఎదుట ఎవరున్నా సరే ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆమె నైజం. అందుకేనేమో రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ గా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇదే విషయం గురించి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా, ఫైర్ బ్రాండ్ అనేది మీడియా పెట్టిన పేరేనని ఆమె నవ్వుతూ చెప్పారు.

తాను ఎంతో అన్యోన్యంగా, వినయంగా, విధేయతతో ఉంటానని రేణుక తెలిపారు. తాను మాట్లాడితే వార్నింగ్ ఇచ్చానంటారని, నవ్వితే రాద్ధాంతం చేశానంటారని... మీడియానే ఇలాంటి కథనాలు రాస్తుంటుందని చెప్పారు. ఖమ్మం జిల్లా నేత భట్టి విక్రమార్క ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారనే విషయం తనకు తెలియదని... కాంగ్రెస్ లో వర్గాలకు తావు లేదని, భట్టి ఓ ఎమ్మెల్యే అని తెలిపారు. కాంగ్రెస్ లో వర్గాలను నడిపేవారు ఏమైపోయారో అందరికీ తెలుసని చెప్పారు.

renuka chowdary
Mallu Bhatti Vikramarka
congress
  • Loading...

More Telugu News