Kurnool District: కర్నూలు జిల్లాలో కుందూ నది ఉగ్రరూపం!

  • వందలాది ఎకరాల పంట నష్టం
  • పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • నీట మునిగిన వంతెనలు

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటిని వదలడంతో కర్నూలు జిల్లాలో కుందూ నది ఉగ్రరూపం దాల్చింది. సమీపంలోని వందలాది ఎకరాల పంటపొలాలు నీట మునగగా, లో లెవల్ బ్రిడ్జిలు పూర్తిగా మునిగిపోయి, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై తాగునీటి అవసరాల నిమిత్తం ఈనెల 19 నుంచి కుందూకు నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.  

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి భానకచర్ల క్రాస్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ మీదుగా 24 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీరు ఇప్పటికే వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ను నింపి, సంతజూటూరు పికప్‌ ఆనకట్ట ద్వారా కుందూ నదిలోకి వస్తోంది. దీంతో వెలుగోడు, బండి ఆత్మకూరు, నంద్యాల, గోస్పాడు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ మండలాల్లో పంట పొలాల్లోకి వరదనీరు వచ్చింది.

  • Loading...

More Telugu News