Arjun Reddy: రక్తమోడుతున్న చేతులతో సిగరెట్... 'అర్జున్ రెడ్డి' తొలి ఫొటో... 'ఏం క్రేజయ్యా' అంటున్న నెటిజన్లు!

  • 'అర్జున్ రెడ్డి' విడుదలై ఏడాది
  • తొలి పిక్ ను షేర్ చేసుకున్న విజయ్ దేవరకొండ
  • నిమిషాల్లో వేలాది షేర్లు, లైక్స్

'అర్జున్ రెడ్డి'... విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం యూత్ కు ఎంతగా కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కలెక్షన్ల సునామీని సృష్టించిన ఈ చిత్రం, యూత్ ను మళ్లీ మళ్లీ సినిమా హాల్స్ వైపు పరుగులు పెట్టించింది. గత సంవత్సరం ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కాగా, ఏడాది తరువాత, 'అర్జున్ రెడ్డి' కోసం తీసిన తొలి ఫొటో అంటూ విజయ్, తన సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్టు చేశాడు.

చేతుల నిండా రక్తపు మరకలతో సిగరెట్ తాగుతున్నట్టున్న ఈ చిత్రం, నిమిషాల్లో వైరల్ అయిపోయింది. దీనికి లైకుల మీద లైకులు, వేలల్లో షేర్లు వచ్చాయి. దీంతో యువతలో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో మరోసారి తెలిసొచ్చింది. ఈ పిక్ చూసిన వాళ్లంతా వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. "ఏందయ్యా ఇది? ఇంత క్రేజా?" అని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. "నువ్వు ఏం చేసినా ఇంతేనా?", "నీ టైమ్ నడుస్తోంది" అన్న కామెంట్లూ వచ్చాయి.

Arjun Reddy
Vijay Devarakonda
Movie
First Photo
  • Error fetching data: Network response was not ok

More Telugu News