suman: చంద్రబాబు నాకు గురువు: సుమన్

  • చంద్రబాబును రామమూర్తినాయుడు పరిచయం చేశారు
  • సినిమాలు, రాజకీయాలు నాకు రెండు కళ్ల వంటివి
  • నిస్వార్థంగా టీడీపీకి ప్రచారం చేశా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు రాజకీయ గురువని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. ఆయన సోదరుడు రామమూర్తి నాయుడు తనను చంద్రబాబుకు పరిచయం చేశారని చెప్పారు. ఎలాంటి పదవిని ఆశించకుండా నిస్వార్థంగా తాను టీడీపీకి ప్రచారం చేశానని అన్నారు. తనకు సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లవంటివని చెప్పారు. తొమ్మిది భాషల్లో 400లకు పైగా చిత్రాల్లో నటించే అవకాశం తనకు లభించడం తాను చేసుకున్న అదృష్టమని అన్నారు. హాలీవుడ్ మూవీలో కూడా నటించే అవకాశం తనకు లభించిందని చెప్పారు.

సినీ పరిశ్రమతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా... ఎందరో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తనకు ఎంతో సహకరించారని సుమన్ తెలిపారు. సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ... కరాటే తనలో ఆత్మవిశ్వాసం సడలకుండా కాపాడిందని చెప్పారు. స్వయంకృషిని నమ్ముకుని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే, విజయాలు సొంతమవుతాయని తెలిపారు. గుంటూరులో తెలుగు యువత అధ్యక్షుడు మురళీకృష్ణ సుమన్ కు నిన్న ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ఈ మేరకు స్పందించారు. 

suman
tollywood
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News