Aaradhya: వినాయక పూజ మరింత సులువు... ఒక్క క్లిక్ తో పూజా కిట్ మొత్తం మీ ఇంటికి!

  • వినాయక పూజ కష్టాలను తొలగించిన 'ఆరాధ్య'
  • కంపెనీ పెట్టి పత్రిని ఇంటికి పంపుతున్న యువకుడు
  • 18 రకాల పూజా సామాగ్రి, 21 రకాల పత్రి ఇంటికే

విఘ్నాలు తొలగాలంటూ, గణనాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ, వినాయకచవితిని ఘనంగా చేసుకుంటుంటాం. అయితే, వినాయకుడి పూజకు అవసరమైన పూజా సామాగ్రి, పత్రిని సేకరించడం అంత సులువైన పని కాదు. అసలు పూజకోసం ఏయే రకాల పత్రిని సేకరించాలో కూడా మనలో చాలా మందికి తెలియదు. గణపతి పూజకు వినియోగించే పత్రులు ఇవేనంటూ రోడ్ల పక్కన రకరకాలు ఆకులు అమ్ముతుంటారు. మనం కూడా రెండో ఆలోచన లేకుండా, వాళ్లడిగినంత సొమ్ము ఇచ్చేసి వాటిని ఇంటికి తీసుకొచ్చి, పూజ చేసేస్తాం.

ఇప్పుడు ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టింది 'ఆరాధ్య' అనే ఆన్ లైన్ కంపెనీ. వినాయకుడి పూజకు అవసరమైన మట్టి వినాయకుడితో పాటు, 18 రకాల పూజా సామాగ్రి,   21 రకాల ముఖ్యమైన పత్రులను  ఓ ప్యాక్ ద్వారా భక్తులకు అందిస్తోంది. ఈ పూజా కిట్ ను పొందాలంటే www.aaradhyakit.com వెబ్ సైట్లోకి లాగిన్ అయి కిట్ ను బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కింద ఉన్న వీడియోలో చూడండి.

భక్తులకు వినాయకుడి కిట్ ను అందించాలనే ఆలోచన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మదిలో మొలకెత్తింది. పూజా సామాగ్రి కోసం, పత్రి కోసం భక్తులు పడుతున్న ఇబ్బందే, ఆయనను ఈ దిశగా అడుగులు వేసేలా చేసింది. 'ఆరాధ్య' పేరిట గత సంవత్సరం సంస్థను ప్రారంభించిన యువకుడు, ఈ సంవత్సరం మరింత మందికి పూజా సామాగ్రిని అందిస్తామని అంటున్నారు. భక్తులకు అవసరమైన అన్నింటినీ ఒకే కిట్ ద్వారా అందిస్తామని, వినాయకుడి తోపాటు, ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో తయారైనవేనని అంటున్నారు.

Aaradhya
Vijayaka
Pooja
Ganesh Chaturdhi
  • Error fetching data: Network response was not ok

More Telugu News