USA: యూఎస్ మాజీ అధ్యక్ష అభ్యర్థి జాన్ మెక్ కెయిన్ కన్నుమూత

  • శనివారం కన్నుమూసిన జాన్ మెక్ కెయిన్
  • 2008లో ఒబామాతో పోటీపడ్డ మెక్ కెయిన్
  • బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ మృతి

అమెరికా సెనెటర్, మాజీ అధ్యక్ష అభ్యర్థి జాన్ మెక్ కెయిన్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గత కొంతకాలంగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం 4.28 (అమెరికా కాలమానం) గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని, ఆ సమయంలో ఆయన భార్య సిండీ, ఇతర కుటుంబీకులు ఆయన వద్దే ఉన్నారని ఓ ప్రకటన వెలువడింది.

దాదాపు ఆరు దశాబ్దాలపాటు అమెరికా ప్రజలకు ఆయన నిస్వార్థ సేవ చేశారని పలువురు నివాళులు అర్పించారు. 2008లో బరాక్ ఒబామాతో అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన మెక్ కెయిన్, ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మెక్ కెయిన్ మృతిపై సంతాపాన్ని తెలిపిన ఒబామా, ఆయన రాజకీయాల్లో అత్యున్నత స్థాయిని చవిచూసిన వ్యక్తని కొనియాడారు.

USA
John Mc Cain
Died
Obama
  • Loading...

More Telugu News