Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఫ్యాషన్' గురించి కాజల్ అగర్వాల్ 
  • జగపతిబాబు జీవితంపై వెబ్ సీరీస్ 
  • హీరోగా ప్రముఖ నటుడి తనయుడు 
  • 'పేపర్ బాయ్' సెన్సార్ పూర్తి  

*  ఆర్టిస్టులకి ఫ్యాషన్ పరంగా కాస్త అవగాహన వుండాలంటోంది కథానాయిక కాజల్. 'ముఖ్యంగా హీరోయిన్లకు ఫ్యాషన్ గురించి తెలిసుండాలి. ఫ్యాషన్ మీద ఎవరికి వాళ్లు అప్ డేట్ అవుతుండాలి. మరింత గ్లామర్ గా కనిపించడం కోసం ఇది కచ్చితంగా వాళ్లకు ఉపయోగపడుతుంది' అని చెప్పింది కాజల్.
*  ప్రముఖ నటుడు జగపతిబాబు జీవితకథతో ఓ బయోపిక్ రానుంది. అయితే ఇది వెబ్ సీరీస్ కావడం విశేషం. 25 ఎపిసోడ్లుగా దీనిని నిర్మించడానికి ప్లాన్ జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
*  పలు తెలుగు సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణామ్ దేవరాజ్ తెలుగుతెరకి హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది.  
*  దర్శకుడు సంపత్ నంది నిర్మించిన 'పేపర్ బాయ్' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ క్లీన్ 'యూ' సర్టిఫికేట్ ఇచ్చింది. సంతోష్ శోభన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 31న ఇది రిలీజ్ అవుతుంది.

Kajal Agarwal
Jagapatibabu
Devaraj
santoshSobhan
  • Loading...

More Telugu News