dancer: ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖ బాలీవుడ్ డ్యాన్సర్

  • సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని అభిజిత్ షిండే ఆత్మహత్య
  • గత కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అభిజిత్
  • బ్యాంక్ అకౌంట్ ను కుమార్తె పేరిట బదిలీ చేయాలంటూ సూసైడ్ నోట్

పలు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించిన ప్రముఖ డ్యాన్సర్ అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన బ్యాంక్ అకౌంట్ ను తన కుమార్తె పేరిట బదిలీ చేయాలని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

మరోవైపు, గత కొంత కాలంగా అభిజిత్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని అతని భార్య తెలిపింది. అతను డిప్రెషన్ తో బాధపడుతున్నాడని చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల డిప్రెషన్ కు లోనై ఉండవచ్చని, ఆత్మహత్యకు ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

dancer
abhijeet shindey
suicide
bollywood
  • Loading...

More Telugu News