Tollywood: బుల్లితెరపై కామెడీ పండించేందుకు సిద్ధమవుతున్న బ్రహ్మానందం

  • త్వరలోనే ఓ చానల్‌లో కామెడీ షో
  • హోస్ట్‌గా వ్యవహరించనున్న బ్రహ్మీ
  • ప్రోమోలో తనదైన పంచ్‌లు

ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు. ప్రముఖ చానల్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఓ కామెడీ షోకి బ్రహ్మీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ చానల్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో బ్రహ్మానందం తనదైన శైలిలో పంచ్‌లు వేసి కామెడీ పండించారు. దీనిని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మీ కామెడీని ఇక ఇంట్లోనే చూడొచ్చని అంటున్నారు.

బ్రహ్మానందం ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నారు. స్టార్ హీరో సినిమాల్లో తప్ప చిన్న సినిమాల్లో నటించడం లేదు. దీంతో ఆయన దృష్టి ఇప్పుడు బుల్లితెరపై పడింది. త్వరలోనే టీవీ తెరపై కనిపించనున్న ఆయన ‘స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు’ అంటూ ప్రోమోలో ఆయన చేసిన సందడి అందరినీ ఆకర్షిస్తోంది. అయితే, షో ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయం తెలియరాలేదు.  

Tollywood
Comedy
Brahmanandam
Telivision
Show
  • Loading...

More Telugu News