YSRCP: టీడీపీ-కాంగ్రెస్ కొత్తరూపంలో రాబోతోంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైసీపీ నాయకుడు సుధాకర్

  • చంద్రబాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు
  • గత ఎన్నికల్లో గెలిచేందుకు పవన్ కాళ్లు పట్టుకున్నారు
  • టీడీపీ నేతలు నైతిక విలువల గురించి మాట్లాడతారా?

ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ కొత్త రూపంలో ప్రజల్లోకి రాబోతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. విజయవాడలోని రాష్ట్ర వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని చంద్రబాబు అన్నట్టు పత్రికల్లో వచ్చిందని, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగానే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో చేరారని ఆరోపించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని, గత ఎన్నికల్లో గెలవడానికి పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి నాయకుడికి మద్దతు ఇస్తున్న టీడీపీ నేతలు నైతిక విలువల గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్ర, దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ పాదయాత్రను చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బాబు పని పడతామని ఆయనకు భయం పట్టుకుందని సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News