tv9: రూ. 500 కోట్లకు టీవీ9 అమ్మకం?

  • కొనుగోలు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్, మైహోమ్స్ గ్రూప్
  • టీవీ9 గ్రూపులో తెలుగు, కన్నడ, గుజరాతీ, మరాఠీ ఛానల్స్
  • ఇంతవరకు వెలువడని అధికారిక సమాచారం

ప్రముఖ మీడియా సంస్థ టీవీ9 చేతులు మారుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. టీవీ9 వ్యవస్థాపకుడు చింతలపూడి శ్రీనివాసరాజు (శ్రీని రాజు) గత కొన్నేళ్లుగా ఈ సంస్థను అమ్మేందుకు యత్నిస్తున్నారు. తాజాగా సుమారు రూ. 500 కోట్లకు డీల్ సెటిల్ అయినట్టు సమాచారం.

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), హైహోమ్ గ్రూప్ లు సంయుక్తంగా టీవీ9 (తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతీయ భాషల ఛానల్స్)ను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఎంఈఐఎల్ పీవీ కృష్ణారెడ్డికి చెందినది కాగా... మైహోమ్ గ్రూపు జూపల్లి రామేశ్వర్ రావు కు చెందినది.

దీనికి సంబంధించి ఇరువైపుల నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. టీవీ9కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఒప్పంద లావీదేవీలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

tv9
sold
sell
srini raju
my homes
jupally rameshwar rao
ieml
  • Loading...

More Telugu News