Andhra Pradesh: అమరావతి బాండ్ల నిర్వాకం గురించి ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం మీకు లేదా?: చంద్రబాబుకి కన్నా ప్రశ్న

  • ప్రతీ వారం చంద్రబాబుకి 5 ప్రశ్నలు
  • తాజాగా మరో 5 ప్రశ్నలు సంధించిన కన్నా
  •  సమాధానం చెప్పగలరా?.. అంటూ నిలదీత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపైన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతీ వారం 5 ప్రశ్నలు సంధిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా చంద్రబాబుకి 5 ప్రశ్నలు సంధించారు. తాను అడిగే ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం చెప్పగలరా?.. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

కన్నా అడిగిన ప్రశ్నలు:

  • షెడ్యూల్డు కులాల సంక్షేమానికి, వికాసానికి వినియోగించాల్సిన నిధులను మీ ప్రచార పథకాలకు మళ్ళించి, షెడ్యూల్డు కులాల వారికి ద్రోహం చేయడం లేదా?
  • రాష్ట్రంలో ఖనిజ సంపదను మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు చట్ట విరుద్ధంగా దోచుకుంటున్న మాట వాస్తవం కాదా?
  • మీ పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి, కమిషన్లు కొట్టేయడానికి, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల్లో పనులకు నామినేషన్ పద్ధతిని ఉపయోగించుకోవడం లేదా?
  • స్విస్ ఛాలెంజ్ పద్ధతిని వక్రీకరించి, అమరావతి రాజధాని ప్రాంతంలో వారికి ఎటువంటి బాధ్యత లేకుండా సీడ్ కాపిటల్ ఏరియాను అప్పగించడంలో అంతరార్థం ఏంటీ?
  • అమరావతి బాండ్ల నిర్వాకం గురించి ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం మీకు లేదా? అధిక వడ్డీ రేట్లను, బాండ్లను ఎందుకు జారీ చేశారో వివరించగలరా? రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి ఎందుకు నెడుతున్నారు?

Andhra Pradesh
Chandrababu
kanna laxminarayana
BJP
Telugudesam
  • Loading...

More Telugu News