Gujarath: వాట్సాప్ చాటింగులపై మందలించిన భర్త.. భార్య తిరగబడడంతో విషం తాగిన భర్త!

  • గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
  • రెండేళ్ల తరువాత ఇండియాకు వచ్చిన భర్త
  • మందలించడంతో దాడికి దిగిన భర్త

పగలనకా, రాత్రనకా వాట్స్ యాప్ లో చాటింగ్ చేస్తూ ఉండిపోతున్న భార్యను మదలించిన ఓ భర్త, తరువాత జరిగిన పరిణామాలతో మనస్తాపానికి గురై విషం తాగాడు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఖోజా సొసైటీలో వెల్డింగ్ పనులు చేస్తుండే కరీమ్ హిరాణీ (42) రెండేళ్ల పాటు ఆఫ్రికాలో ఉద్యోగం చేసి, ఈమధ్యే భార్యా పిల్లలను చూసేందుకు ఇండియాకు వచ్చాడు.

అయితే, భర్తను పట్టించుకోని భార్య, ఎప్పుడు చూసినా చాటింగ్ లో నిమగ్నమై ఉండేది. దీంతో భార్యను కరీమ్ మందలించాడు. పద్ధతి మార్చుకోకపోగా, ఎదురు డాడికి దిగిన ఆమె, కరీమ్ ను కొట్టింది. దీంతో కలత చెందిన కరీమ్, విషం తాగాడు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు కరీమ్ ను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ దంపతుల మధ్య గతంలోనూ విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది.

Gujarath
Rajkot
Whatsapp
Chating
Wife
  • Loading...

More Telugu News