Student: స్టూడెంట్ ను నమ్మించి గర్భవతిని చేసిన కీచకుడు... ఏలూరు వీధుల్లో నగ్నంగా ఊరేగించిన ప్రజలు

  • విద్యార్థినికి మాయమాటలు చెప్పిన టీచర్
  • పలు మార్లు అత్యాచారం
  • చావగొడుతూ ఊరేగించిన ప్రజలు

స్కూలు కెళ్లి చదువుకుంటున్న ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి లోబరచుకున్న కీచక ఉపాధ్యాయుడు, ఆమెను గర్భవతిని చేయడంతో, పట్టలేని ఆగ్రహంతో ఏలూరు ప్రజలు అతన్ని చావగొడుతూ ఒంటిమీద నూలుపోగు లేకుండా వీధుల్లో తిప్పి, పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, కర్నూలుకు చెందిన కారె రాంబాబు (38) అనే వ్యక్తి గత ఆరేళ్లుగా ఏలూరులోని ఓ స్కూల్‌ లో ఇంగ్లీషు, లెక్కలు బోధిస్తున్నాడు. ప్రస్తుతం పాలిటెక్నిక్‌ తొలి సంవత్సరం చదువుతున్న బాధితురాలు, గతంలో రాంబాబు పనిచేస్తున్న స్కూలులో పదో తరగతి వరకూ చదివింది. ఆ సమయంలో రాంబాబు అనేకసార్లు తన గదికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇంట్లో చెబితే, తనను దండిస్తారన్న భయంతో బాలిక ఈ విషయం చెప్పలేదు.

 తమ కుమార్తె గర్భం దాల్చిందని ఇటీవల గుర్తించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో ఆ అమ్మాయి విషయం చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో స్కూలుకు వచ్చిన వారు, రాంబాబు గదిలోకి చొరబడి, బయటకు లాక్కొచ్చి, బట్టలూడదీసి కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాంబాబును ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Student
Teacher
Nude
Pregnent
Eluru
West Godavari District
  • Loading...

More Telugu News