Andhra Pradesh: జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ముమ్మరం.. వేగం పెంచిన ఈడీ

  • మారిన పీఎంఎల్ఏ నిబంధనలు
  • అందుకు అనుగుణంగా దర్యాప్తు
  • ఇప్పటికే పలు కేసుల్లో చార్జిషీట్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిధుల అక్రమ మళ్లింపు నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లో నిబంధనలు మారిన నేపథ్యంలో ఈడీ వేగం పెంచింది. పెండింగ్‌లో ఉన్న అక్రమాస్తుల కేసులతోపాటు నిధుల మళ్లింపు కేసుల దర్యాప్తులోనూ వేగం పెంచింది. ఇప్పటికే పలు కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసింది.

పీఎంఎల్ఏలో మారిన నిబంధనల ప్రకారం మూడు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ విషయంలో ఇప్పటి వరకు నిర్దిష్ట సమయం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మారిన నిబంధనల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఈడీ ముందుకు సాగాలని, దర్యాప్తులో వేగం పెంచాలని ఈడీ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News