Gangula Prabhakar: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడి మృతి!

  • నేటి ఉదయం వాహ్యాళికి వెళ్లిన ప్రభాకర్
  • గుండెపోటుతో రహదారిపైనే కుప్పకూలిన వైనం 
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. కొత్తపల్లి మండలం రేకుర్తి వద్ద, ఈ ఉదయం తన ఇంటి నుంచి వాకింగ్ కి వెళ్లిన ఆయనకు మార్గమధ్యంలో గుండెపోటు వచ్చింది. దీంతో రహదారిపైనే ఆయన కుప్పకూలిపోయారు. ప్రభాకర్ ను గమనించిన స్థానికులు, హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. గంగుల ప్రభాకర్ మృతి విషయాన్ని తెలుసుకుని, రేకుర్తి చేరుకున్న కమలాకర్ సోదరుడిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ప్రభాకర్ మృతికి పలువురు టీఆర్ఎస్ నేతలు సంతాపం వెలిబుచ్చారు.

Gangula Prabhakar
Gangula Kamalakar
Karimnagar
  • Loading...

More Telugu News