Kerala: కేరళ బాధితులకు సెక్స్ వర్కర్ల 'ఉడత సాయం'!

  • రూ. 21 వేల విరాళం
  • నెలాఖరులోగా లక్ష చేరుస్తామని వెల్లడి
  • డిప్యూటీ కలెక్టర్ కు చెక్కు

మహారాష్ట్ర సెక్స్ వర్కర్లు, కేరళ వరద బాధితులకు తమవంతు సాయాన్ని ప్రకటిస్తూ, రూ. 21 వేలను విరాళంగా అందించారు. ఈ నెలాఖరులోగా, తమకు విటులు ఇచ్చే డబ్బు నుంచి కొంత పోగేసి, లక్ష వరకూ వరద బాధితులకు అందిస్తామని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన సెక్స్ వర్కర్లు తెలిపారు. పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ డబ్బును కేరళకు చేర్చాలని డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కు ఈ చెక్కును అందించామని సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఓ ఎన్జీవో ప్రతినిధి వెల్లడించారు. గతంలోనూ వీరు పలుమార్లు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సాయం చేశారని అన్నారు. 2015లో చెన్నైని వరద ముంచెత్తినప్పుడు, 2001లో గుజరాత్ భూకంపం వేళ, 2004లో సునామీ వచ్చినప్పుడు, కార్గిల్ యుద్ధం వేళ, మహారాష్ట్రను కరవు ముంచెత్తినప్పుడు, వీరు రూ. 27 లక్షల విరాళం ఇచ్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News