imran khan: సిద్ధూపై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్

  • శాంతికి బ్రాండ్ అంబాసడర్ సిద్ధూ
  • సిద్ధూను విమర్శిస్తున్న వారంతా శాంతికి విఘాతం కలిగిస్తున్నారు
  • శాంతి లేకుండా మన ప్రజలు అభివృద్ధి చెందలేరు

పాక్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి సిద్ధూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ను ఆయన హత్తుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో సిద్ధూపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. 'శాంతికి బ్రాండ్ అంబాసడర్ సిద్ధూ' అంటూ ఆయన కొనియాడారు. ఇండియాలో సిద్ధూపై విమర్శలు కురిపిస్తున్న వారంతా... ఉపఖండంలో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. శాంతి లేకుండా మన ప్రజలు అభివృద్ధి చెందలేరని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మరోవైపు తనపై వస్తున్న విమర్శలను సిద్ధూ కొట్టిపడేశారు. తాను రాజకీయాల కోసం పాక్ వెళ్లలేదని... తన మిత్రుడి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళ్లానని చెప్పారు. గతంలో దివంగత వాజపేయి కూడా పాకిస్థాన్ వెళ్లారని... 2015లో ఎలాంటి అధికారిక షెడ్యూల్ లేకుండానే మోదీ లాహోర్ లో దిగి, నవాజ్ షరీఫ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ విషయంపై మోదీని ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. 

  • Loading...

More Telugu News