manjith singh: అమెరికాలో సిక్కు నేతపై దాడి చేసిన ఖలిస్థాన్ మద్దతుదారులు

  • న్యూయార్క్ లో ఓ టీవీ చర్చలో పాల్గొన్న మంజిత్ సింగ్
  • వెలుపలకు వచ్చిన ఆయనపై ఖలిస్థాన్ మద్దతుదారుల దాడి
  • ఇలాంటి వాటికి తాను భయపడనన్న మంజిత్

ఖలిస్థాన్ కు మద్దతు పలుకుతున్న అమెరికాలోని కొందరు సిక్కులు... ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షుడు, శిరోమణి అకాళీదళ్ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు అయిన మంజిత్ సింగ్ పై దాడికి తెగబడ్డారు. న్యూయార్క్ లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న అనంతరం వెలుపలికి వచ్చిన అతనిపై దాడికి పాల్పడ్డారు.

దీనికి సంబంధించిన వీడియోను మంజిత్ విడుదల చేశారు. తనపైనా, తన బంధువులపైనా దాడి జరిగిందని... ఇలాంటి పిరికిపంద చర్యలు తనను భయపెట్టవని ఆయన అన్నారు. తన జాతికి సేవ చేయడం నుంచి ఇలాంటి ఘటనలు తనను దూరం చేయలేవని చెప్పారు. తన తుది శ్వాస వరకు తాను పోరాడుతూనే ఉంటానని అన్నారు.

manjith singh
new york
america
attack
khalistan
  • Loading...

More Telugu News