Andhra Pradesh: ఇదో అద్భుతమైన కాలం... అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి: చంద్రబాబు

  • అమరావతిలో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • అనుకున్న పనులన్నీ పూర్తయ్యే మంచి తరుణమిదే
  • జనవరిలోగా టార్గెట్ ను పూర్తి చేయాలి
  • కలెక్టర్లు, హెచ్ఓడీలకు చంద్రబాబు ఆదేశం

ప్రస్తుతం మనం అద్భుతమైన సమయంలో ఉన్నామని, అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం చీఫ్ సెక్రటరీలు, వివిధ విభాగాల అధిపతులు, కలెక్టర్లతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, అనుకున్న పనులన్నీ పూర్తయ్యే మంచి తరుణం ఇదేనని వ్యాఖ్యానించారు. గ్రామదర్శినితో పాటు కేంద్రం నుంచి వస్తున్న సాయం, పలు శాఖల పురోగతిపై ఆయన మాట్లాడారు.

గత మూడు సంవత్సరాలుగా సులభతర వ్యాపార నిర్వహణలో ముందున్నామని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రం విడిపోయిన తరువాత 511 అవార్డులు లభించాయని చెప్పారు. సగటున 10.5 శాతం వృద్ధి నమోదైందని, సురక్షితమైన నగరాల్లో తిరుపతి దేశంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుందని అన్నారు. విజయవాడ, తిరుపతి నగరాలు మెరుగైన జీవనం సాగించేందుకు వీలున్న నగరాలుగా నిలిచాయని చంద్రబాబు గుర్తు చేశారు.

డిసెంబర్ లోగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రణాళికలను తయారు చేయాలని అధికారులకు సూచించిన చంద్రబాబు, గ్రామదర్శిని ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాలని ఆదేశించారు. గ్రామాలు, మండలాల వారీగా విజన్ డాక్యుమెంట్లను తయారు చేసి తనకు సమర్పించాలని, వాటిని పరిశీలించిన తరువాత, రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకెళ్లే భవిష్యత్ ప్రణాళికను తయారు చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలోగా టార్గెట్లను చేరుకోవాలని ఆదేశించారు.

Andhra Pradesh
Chandrababu
Amaravati
Video Conference
  • Loading...

More Telugu News