Kerala: వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకున్న కేరళ నటుడు రాజీవ్!

  • అతలాకుతలమైన నన్నూరు
  • సహాయక చర్యల్లో రాజీవ్ పిళ్లై
  • సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్న హీరో

కేరళలోని నన్నూర్ ఇటీవలి వరదలకు అతలాకుతలం కాగా, అదే ప్రాంతంలో నివాసముంటున్న నటుడు రాజీవ్ పిళ్లై, ఇంజనీరింగ్ స్టూడెంట్ అజితతో జరగాల్సిన తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. ఈ విషయాన్ని రాజీవ్ కోస్టార్ రిచా చాదా తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంటూ, పల్లపు ప్రాంతాల్లో రాజీవ్ తిరుగుతూ, పడవల సాయంతో నిరాశ్రయులను, చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమై ఉన్నాడని చెప్పారు. తన మిత్రుడు చేస్తున్న సాయాన్ని చూసి గర్వపడుతున్నట్టు పేర్కొన్నారు. తన వివాహాన్ని వాయిదా వేసుకునిమరీ నన్నూరులో జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటున్న రాజీవ్ ను సూపర్ హీరో అని ఇప్పుడు అభిమానులు కొనియాడుతున్నారు.

Kerala
Floods
Rains
Rajive Pillai
  • Loading...

More Telugu News