Sairaa: వస్తూనే ఇరగదీసిన నరసింహారెడ్డి... 'సైరా' టీజర్ ఇదిగో చూసేయండి!

  • కొద్ది సేపటి క్రితం విడుదలైన 'సైరా' టీజర్
  • నెట్టింట దుమ్ము రేపుతున్న టీజర్
  • క్షణాల్లో వేల హిట్స్

మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైరా' చిత్రం టీజర్ విడుదలైంది. నెట్టింట దూసుకెళుతున్న ఈ టీజర్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో, రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లో, బ్రిటీష్ వారి కోటను, ఆపై ఓ గ్రామంలో గుర్రపు బండ్లు వెళుతూ ఉండటం, ఓ భారతీయుడి వీపునే మెట్టుగా చేసుకుని బ్రిటీష్ అధికారి బండి దిగడాన్ని చూపారు.

ఆపై అసలు సీన్ మొదలైంది. కమ్ముకొస్తున్న మేఘాల మధ్య, బ్రిటీష్ వారి కోటపై జెండా పట్టుకుని నిలబడిన నరసింహారెడ్డిని చూపించారు. ఓ మర ఫిరంగిని పేల్చుకున్న సీన్ ను, 'ఈ యుద్ధం ఎవరిది?' అని నరసింహారెడ్డి ప్రశ్నించగా, 'మనది' అని నినదిస్తున్న ఆయన అనుచరులను చూపించారు. అపై బ్రిటీష్ అధికారి "నరసింహారెడ్డి..." అని ఆగ్రహంగా అరవడం, గుర్రంపై బ్రిటీష్ సైనికుల మీదకు నరసింహారెడ్డి దూసుకు రావడాన్ని చూపించారు. కొన్ని క్షణాల్లోనే వేల హిట్స్ తెచ్చుకున్న టీజర్ ను మీరూ చూసేయండి.

Sairaa
Teaser
Chiranjeevi
Ramcharan
you Tube
  • Error fetching data: Network response was not ok

More Telugu News