kodagu: షాకింగ్... కొడగు జిల్లాలో 4వేల మంది గల్లంతు!
- కర్ణాటకలోని కొడగు జిల్లాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు
- గల్లంతయిన వారి కోసం గాలింపు
- వరదల్లో చిక్కుకున్న 50 వేలకు పైగా జనం
కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు... కర్ణాటకలోని కొడగు జిల్లాను కూడా అతలాకుతలం చేశాయి. జల ప్రళయానికి కొడగు జిల్లాలో 4 వేల మందికి పైగా గల్లంతయ్యారనే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో 50 వేల మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మడికేరిలో 18, విరాజ్ పేటలో 7, సోమవారపేటలో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 5,818 మందికి ఆశ్రయం కల్పించారు.
మక్లూడు గ్రామంలో నీటిలో చిక్కుకుపోయిన 60 మందిని సైన్యం గుర్తించింది. వీరందరినీ సినీ నటి హర్షికా పూనాంచా బంధువులుగా గుర్తించారు. మన్నంగేరి, జోడుపాల ప్రాంతాల్లో జాతీయ భద్రతాదళం సహాయక చర్యలను అందిస్తోంది.