Siddu: పాక్ లో సిద్ధూ 'ఆలింగనం'పై పంజాబ్ సీఎం మండిపాటు

  • పాక్ ఆర్మీ చీఫ్ ను సిద్ధూ ఆలింగనం చేసుకోవడంపై విమర్శలు 
  • బాజ్వా పట్ల సిద్ధూ అంత అభిమానం చూపటం సరికాదన్న సీఎం   
  • ఆయన చేసిన పనిని సమర్ధించనన్న అమరీందర్ సింగ్

ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా వెళ్ళిన నవజ్యోత్ సింగ్ సిద్దూ.. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ బాజ్వాను ఆలింగనం చేసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా సిద్ధూ వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాను నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ ఆలింగనం చేసుకోవడం తప్పు అన్న అమరీందర్ సింగ్, బాజ్వా పట్ల సిద్ధూ అంత అభిమానం చూపటం సరికాదు అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతేకాదు, ఈ విషయంలో సిద్ధూ చేసిన పనిని సమర్ధించనని, ఆయనకు మద్దతు ఇవ్వనని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News