YSRCP: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన జగన్!

  • రూ.కోటి విరాళం ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత
  • సీఎం సహాయ నిధికి పంపుతామని వెల్లడి
  • కేరళను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముందుకొచ్చారు. వరద బాధితుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున, తన తరఫున రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.

కేరళలో నెలకొన్న దారుణ పరిస్థితులు తన మనసును కలచివేస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వరదలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న కేరళను ఆదుకోవాలని జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

YSRCP
Kerala
FLOODS
YS JAGAN
Rs.1 Cr
Andhra Pradesh
assembly
opposition leader
  • Loading...

More Telugu News