MOVIE NEWS: ‘గీత గోవిందం’ దెబ్బకు కుదేలవుతున్న హిందీ సినిమాలు!

  • ఆస్ట్రేలియాలో టాప్ గ్రాసర్ గా నిలిచిన సినిమా
  • గోల్డ్, సత్యమేవ జయతే కంటే భారీ కలెక్షన్లు
  • ట్విట్టర్ లో తెలిపిన ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సినిమా ఆస్ట్రేలియాలో టాప్ బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి కలెక్షన్లలో అగ్రస్థానం దక్కించుకుంది.

గీత గోవిందం అమెరికాలో ఇప్పటిదాకా 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’, జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమాలను తాజాగా ఆస్ట్రేలియాలో గీత గోవిందం వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు.

ఆస్ట్రేలియాలో గోల్డ్, సత్యమేవ జయతే సినిమాలు ఈ వారాంతానికి 1,92,306 డాలర్లు వసూలు చేయగా, ఒక్క గీత గోవిందం సినిమాకే 2,02,266 డాలర్లు వచ్చాయని వెల్లడించారు. ఈ రెండు సినిమాలు గీత గోవిందం ముందు నిలబడలేకపోతున్నాయని పేర్కొన్నారు.


MOVIE NEWS
GEETA GOVINDAM
Australia
TOP GROSSER
SATYAMEVA JAYATE
GOLD
VIJAY DEVARAKONDA
  • Loading...

More Telugu News