shooting: రెండో రోజు రజతంతో పతకాల వేటను ప్రారంభించిన భారత్!

  • ఏషియన్ గేమ్స్ లో భారత్ కు తొలి రజతం
  • 626.3 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచిన దీపక్ కుమార్
  • భారత ఒలింపిక్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు

ఇండోనేసియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ రెండో రోజు భారత్ రజత పతకంతో బోణీ చేసింది. భారత షూటర్ దీపక్ కుమార్ సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో రెండోస్థానంలో నిలిచాడు.

ఈ పోటీలో దక్షిణ కొరియా ఆటగాడు సాంగ్ సూజూ 629.7 పాయింట్లతో తొలిస్థానంలో నిలవగా, దీపక్ కుమార్ 626.3 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఇరాన్ షూటర్ నెకోనమ్ 625.7 పాయింట్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. రజత పతకం సాధించిన దీపక్ కుమార్ కు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపింది. 

shooting
deepak kumar
silver
2018 ASIAN GAMES
  • Loading...

More Telugu News