kerala: కేరళకు తమ వంతు సాయం అందించిన నాగార్జున.. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంత ఇచ్చారంటే..!

  • కేరళను ఆదుకునేందుకు మేము సైతం అంటున్న టాలీవుడ్
  • రూ. 28 లక్షల విరాళం ప్రకటించిన నాగార్జున, అమల
  • భారీ విరాళాలు ప్రకటించిన చిరు, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్

భారీ వర్షాలు, వరద బీభత్సంతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు మేము సైతం అంటున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున, అమలలు తమ వంతుగా రూ. 28 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ లు రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షల విలువైన మందులు పంపుతామంటూ రామ్ చరణ్ భార్య ఉపాసన తెలిపారు. బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్ లు తలా రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. కల్యాణ్ రామ్ రూ. 10 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, దర్శకుడు కొరటాల శివ రూ. 3 లక్షలను తమ వంతు సాయంగా ప్రకటించారు.

kerala
floods
jagarjuna
amala
tollywood
donation
  • Loading...

More Telugu News