Payal Rajput: కాస్టింగ్ కౌచ్ నిజమే... నాలుగు రోజుల క్రితం ప్రపోజల్ వచ్చిందన్న 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్!

  • అమ్మాయిలను పిలవడం 100 శాతం నిజం
  • నా ముందుకు ఒక వ్యక్తి ప్రపోజల్ తెచ్చాడు
  • తాను కాంప్రమైజ్ అయ్యే రకాన్ని కాదన్న పాయల్ రాజ్ పుత్

సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి, అమ్మాయిలను పడకగదికి రమ్మని పిలవడం 100 శాతం నిజమని 'ఆర్ఎక్స్ 100'తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ చెప్పింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ చిత్రంలో బోల్డ్ పాత్రలో కనిపించినందువల్ల, తాను కూడా అటువంటి బాపతు అమ్మాయినే అనుకున్నారేమోనని చెప్పుకొచ్చిన పాయల్, నాలుగు రోజుల క్రితం తనను కాంప్రమైజ్ కావాలని ఒకరు ప్రపోజ్ చేశారని చెప్పింది.

ఈ మాటలను తప్పకుండా ప్రచురించాలని చెబుతూ, "ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇటువంటి కోరికతో ఒకరు నా ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నేను కాంప్రమైజ్ అయి ఈ స్థాయికి రాలేదు. నేను టాలెంట్ తోనే వచ్చాను. నేను చెప్పదలచుకున్నది అదే" అని చెప్పింది. తన జీవితంలో ఎన్నడూ కాంప్రమైజ్ అయ్యేపనే లేదని కుండబద్దలు కొట్టింది పాయల్ రాజ్ పుత్. ఇక తనను ఇలా అడిగింది ఎవరన్న విషయాన్ని మాత్రం ఈ భామ వెల్లడించలేదు.

Payal Rajput
RX 100
Casting Couch
Tollywood
  • Loading...

More Telugu News