Anantapur District: మోసపోయిన చెల్లిపై అఘాయిత్యం చేసిన అన్న... అనంతపురంలో 14 ఏళ్ల బాలిక ప్రసవం!

  • శుక్రవారం నాడు ప్రసవించిన బాలిక
  • మాయమాటలతో అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్
  • విషయం తెలుసుకుని లైంగికదాడికి పాల్పడిన అన్న

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలిక ప్రసవించిందన్న వార్త తీవ్ర కలకలం రేపగా, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక శుక్రవారం ప్రసవించగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. ఓ ఆటోడ్రైవర్ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి, బాలికపై అత్యాచారం చేశాడని, ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి అన్న, ఆమెపై తరచూ లైంగిక దాడికి పాల్పడగా, బాధితురాలు గర్భం దాల్చిందని తెలిపారు. కిరాతకుడిగా మారిన సొంత సోదరుడు, చెల్లికి రక్షణగా ఉండాల్సిందిపోయి, దుర్మార్గంగా ప్రవర్తించాడని, ఈ కేసులో బాలిక సోదరుడితో పాటు ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశామని వెల్లడించారు.

Anantapur District
Auto Driver
Minor
Pregnency
Brother
Delivery
Police
Arrest
  • Loading...

More Telugu News